
తిరుమల, 10 మే (హి.స.)
: తిరుమల తిరుపతి దేవాలయానికి చెందిన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులురెడ్డి తితిదే బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాత విరాళం డీడీని తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. వారివెంట తితిదే బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ