'ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తాం': భువనగిరి ఎమ్మెల్యే
'ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తాం': భువనగిరి ఎమ్మెల్యే
Mla


యాదాద్రి భువనగిరి, 13 మే (హి.స.)

భువనగిరి కలెక్టరేట్లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పరిధిలోని సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన కార్యశాలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ దోహదపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ నిర్ణయం విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపునకు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతలు భువనగిరి మంజూరు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై మరింత శ్రద్ధ పెట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సదుపాయాలు, మెరుగైన బోధన విధానాలతో ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదవుతుండటం ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande