తెలంగాణకి చెందిన పూజిత లండన్ లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం
తెలంగాణకి చెందిన పూజిత లండన్ లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం
తెలంగాణకి చెందిన పూజిత లండన్ లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం

వర్ధన్నపేట,, 10 మే (హి.స.) : హనుమకొండ జిల్లా ఐనవోలుకు చెందిన పూజిత లండన్లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్గా విజయం సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒంటిమామిడిపల్లికి చెందిన కడదూరి శ్రీనివాస్ హోటల్ మేనేజ్మెంట్ చేసి లండన్లో ఉంటున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఉసిల్లపల్లికి చెందిన కొంకటి పూజిత బయోటెక్నాలజీ పూర్తి చేసి లండన్లో స్థిరపడ్డారు. వీరిద్దరికి గత ఏడాది వివాహమైంది. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో 11 మంది వివిధ పార్టీల అభ్యర్థులతో ఆమె పోటీ పడి, ది గ్రీన్ పార్టీ మద్దతుతో న్యూహమ్ బరో రాయల్ ఆల్బర్ట్ కౌన్సిలర్గా గెలిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande