గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు.ప్రణాళికలు
గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు.ప్రణాళికలు
గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు.ప్రణాళికలు


ద్వారకాతిరుమల 10 మే (హి.స.)

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో రూ.29 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకూ జరిగే పుష్కరాలను ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహిస్తామని చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతంలోని 43 ఆలయాలను రూ.54.71 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘రాష్ట్రంలోని 6,200 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం అర్చకులకు ఏటా రూ.74.74 కోట్లు అందిస్తున్నాం. 27 వేల ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంతవరకు 691 దేవాలయాల అభివృద్ధికి రూ.842.67 కోట్లతో పనులు చేపట్టాం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయాలు లేని కుగ్రామాలు, కాలనీల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో 5శాతం వేల భజన మందిరాలు (చిన్న దేవాలయాలు) నిర్మిస్తాం. ఇంతవరకు 1,059 భజన మందిరాల నిర్మాణానికి రూ.181.10 కోట్లు మంజూరు చేశాం’ అని మంత్రి వివరించారు. ‘వేదం చదివే విద్యార్థులకు నెలకు రూ.3వేలు చొప్పున మూడేళ్లు భృతి ఇస్తాం. రామతీర్థం, శ్రీకాళహస్తిల్లో గిరిప్రదక్షిణకు రూ.20కోట్లతో రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నాం’ అని ఆనం వెల్లడించారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, ఆలయ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande