
విజయనగరం, 10 మే (హి.స.)
రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా మెట్ట డబల్ కాలనీలో ఆకస్మికంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు. సరైన అనుమతి పత్రాలు లేని 80 వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నిషేధిత వస్తువులు, గంజాయి నిల్వలు ఉంటే సహించేది లేదన్నారు. మత్తు పదార్థాల సరఫరా చేసినా, విక్రయించినా, సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే డయల్ 100, 112 లేదా స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో స్వగ్రామాలకు వెళ్తే పోలీసులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ