
అమరావతి, 10 మే (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం దిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లనున్న సీఎం 11.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో సమావేశం అవుతారు. రేపు రాత్రికి దిల్లీలోనే సీఎం బస చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ