
హైదరాబాద్, 10 మే (హి.స.)ఎన్హెచ్ఏఐ (NHAI) చైర్మన్ సంతోశ్ కుమార్ యాదవ్తో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు (ఆదివారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు. హైదరాబాద్లో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్ పనులు త్వరగా ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ – విజయవాడ NH-65ను 8 లేన్ల విస్తరణపై చర్చించారు.
డెత్ రోడ్గా మారిన NH-65పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఎల్బీనగర్ – హయత్నగర్ మధ్య 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించినట్లు వివరించారు. నాగపూర్ తరహాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు. ఇప్పటికే డీపీఆర్ని MoRTHకు పంపినట్లు వెల్లడించారు. RRR, NH-65 టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు సంతోశ్ కుమార్ యాదవ్ తెలిపారు. మంత్రి కోమటిరెడ్డితో పాటు స్పెషల్ సీఎస్ వికాస్రాజ్ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్