కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి: మంత్రి పొంగులేటి
ఖమ్మం, 10 మే (హి.స.) పార్టీ కోసం శ్రామికుల్లా పని చేయాలని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నూతన అధ్యక్షులపై ఆధారపడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారిని ఘనంగా అన్నారు. ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు
Minister


ఖమ్మం, 10 మే (హి.స.)

పార్టీ కోసం శ్రామికుల్లా పని చేయాలని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నూతన అధ్యక్షులపై ఆధారపడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారిని ఘనంగా అన్నారు. ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తోట వీరభద్రం, ఏదులాపురం మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భానోత్ కిషోర్ నాయక్ నియామకమైన సందర్భంగా ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నూతన అధ్యక్షులపై ఉందన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేలా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్లో తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande