రేవంత్రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?: మోదీ ఆసక్తికర వ్యాఖ్య
హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్·రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్య చేశారు
Modi


హైదరాబాద్, 10 మే (హి.స.)హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్·రెడ్డి (Revanth Reddy)ని ఉద్దేశించి ప్రధాని మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పలు ప్రాజెక్టులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చెబుతూ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొచ్చారు.

గతంలో రైల్వే బడ్జెట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రూ.వెయ్యి కోట్లు కూడా వచ్చేవి కాదని మోదీ అన్నారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న సీఎం రేవంత్ను ఉద్దేశిస్తూ ‘‘రేవంత్రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.ఐదున్నర వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రధాని సరదాగా చేసిన వ్యాఖ్యతో రేవంత్తో పాటు వేదికపై ఉన్న కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తదితరులు నవ్వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande