మెగా జాబ్ మేళా అభినందనీయం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, 10 మే (హి.స.) గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా అభినందనీయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కుంభం ఫౌండేషన్, 1M1B సంయుక్త ఆధ్వర్యంలో భువన
Mp


యాదాద్రి భువనగిరి, 10 మే (హి.స.)

గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా అభినందనీయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కుంభం ఫౌండేషన్, 1M1B సంయుక్త ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. గత రెండు రోజులుగా స్క్రీనింగ్ పరీక్షలు, టోకెన్ల కేటాయింపు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగా, ఆదివారం ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎంపీ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కుంభం ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

ఈ జాబ్ మేళా ద్వారా అనేక కుటుంబాలకు ఉపాధి భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ధైర్యంగా ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలని సూచించారు. ఉద్యోగం చిన్నదైనా అనుభవాన్ని సంపాదించడం ఎంతో ముఖ్యమని, నైపుణ్యం మరియు అనుభవమే భవిష్యత్తులో ఉన్నత అవకాశాలకు దారి తీస్తాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande