
హైదరాబాద్, 10 మే (హి.స.)
తెలంగాణలో
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా రూ.9,377
కోట్ల
ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
చేశారు.బెంగళూరు నుంచి మధ్యాహ్నం
బేగంపేటకు చేరుకున్న మోదీ రోడ్డుమార్గంలో హెచ్ఐసీసీకి వెళ్లారు.ఈ
సందర్భంగా ప్రధాని మోదీని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం..
మోదీకి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. ఇక.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
శ్రీరాముడి ప్రతిమను మోదీకి బహూకరించారు. తర్వాతసీఎం
రేవంత్,
కేంద్రమంత్రులు
కిషన్రెడ్డి,
సంజయ్తో
కలిసి వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్లో పీఎం మిత్ర పార్కు,
జహీరాబాద్లో
పారిశ్రామిక ప్రాంతం,
గుడెబెల్లూర్-మహబూబ్నగర్
మధ్య 165 కిలో మీటర్ల నాలుగు
వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్లో నిర్మించిన
ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు.వీటిలో
రూ.3,180
కోట్లతో చేపట్టే రహదారి పనులు, రూ.2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్
సిటీ ఉన్నాయి. రూ.610
కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు శ్రీకారం చుట్టిన మోదీ.. రూ.1,243 కోట్లతో కాజీపేట-విజయవాడ
ట్రిపులింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం రూ.1,700
కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభత్సవంలో పాల్గొన్న
ప్రధాని.. రూ.300
కోట్లతో నిర్మించిన రైలు అండర్ రైల్ బైపాస్ లైన్నూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
మోదీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ
సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర
మంత్రులు, ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రహదారులు, ఆరోగ్య సేవల విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు.
ప్రధాని
పర్యటన అభివృద్ధి,
రాజకీయపరంగానూ
ఆసక్తికరంగా మారింది. ఇటీవల దేశంలో జరిగిన నాలుగు రాష్ట్రాలు,
ఒక
కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని
సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. తెలంగాణలో పార్టీ
కార్యకలాపాలు బలోపేతంపై పలు సూచనలు చేయనున్నారని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi