
నంద్యాల, 10 మే (హి.స.)నంద్యాల ట్రాఫిక్ సీఐ చాంద్ బాషాపై చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని ఏఐటీయూసీ (AITUC) డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్లు, వీధి విక్రయదారులు, తోపుడు బండ్ల నిర్వాహకులపై ట్రాఫిక్ సీఐ విచక్షణారహితంగా దాడి చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు.
నంద్యాల ట్రాఫిక్ సీఐ చాంద్ బాషాను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ధనుంజయుడు డిమాండ్ చేశారు.
సీఐ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఆటో డ్రైవర్లను, చిన్న వ్యాపారులను కొడుతున్నారని విమర్శించారు.ఆటో కార్మికులు, వీధి వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు దాడులు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ధనుంజయుడు మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV