సూర్యాపేట జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్..
సూర్యాపేట జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్..
పోలీస్


సూర్యాపేట, 10 మే (హి.స.)

సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చింతలపాలెం మండలంలోని తమ్మవరం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, పది మంది ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, వీరితో పాటు సుమారు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికల పై నిఘా పెట్టారు. అలాగే గంజాయి, అక్రమ మద్యం, మారణాయుధాలు వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయా అనే కోణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

కార్డన్ సెర్చ్ సందర్భంగా పత్రాలు అందుబాటులో లేని 51 ద్విచక్ర వాహనాలు, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంబంధిత వాహన యజమానులు సరైన పత్రాలు సమర్పించి తమ వాహనాలను తిరిగి పొందవచ్చని చెప్పారు. ఎటువంటి ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో శాంతి పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భద్రతలను భావాన్ని పెంపొందించడం, రౌడీషీటర్లు మరియు అనుమానితుల కదలికలపై నిఘా ఉంచడం వంటి లక్ష్యాలతో పోలీసు శాఖ విధుల్లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande