
కర్నూలు, 10 మే (హి.స.)కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఐటీయూ కర్నూలు నగర ప్రధాన కార్యదర్శి విజయరామాంజనేయులు డిమాండ్ చేశారు.
ఈ రోజు ఆదివారం సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా వచ్చిన 8 గంటల పని విధానం, కనీస వేతన చట్టం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ, పని భద్రత వంటి హక్కులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్మిక కోడ్ల అమలుతో 8 గంటల పని విధానం రద్దై 12 గంటల పని భారం పెరుగుతుందని ఆయన అన్నారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నేడు బీజేపీ ప్రభు త్వం ఏకపక్షంగా వ్యవహరించి నాలుగు లేబర్ కోడ్లుగా చేసింద న్నారు. కనీస వేతన హక్కు చట్టం, గ్రాట్యుటి, పెన్షన, పనిభద్రత, సెలవులు ఇతర సౌకర్యాలు లేకుండా చట్టాల వల్ల కార్మికుల హక్కులు పూర్తిగా హరించివేసిందన్నారు. తక్షణమే కార్మికులకు, ఉద్యోగులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు ఉద్యమిం చాలని సీఐటీయూ నాయకులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV