
మేడ్చల్ మల్కాజిగిరి, 10 మే (హి.స.)
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిడబిల్పూర్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న 30 ఎద్దులను పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ లోని శాస్త్రిపురంకు (TG06T3777) నంబర్ గల లారీలో ఎద్దులను గుంపుగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహన డ్రైవర్ అహ్మద్ ఖాన్ (47), మోయిన్బాగ్, సంతోష్నగర్, హైదరాబాదు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎద్దులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు