కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. ప్రశ్నల వర్షం
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. ప్రశ్నల వర్షం
అంబటి


కడప, 10 మే (హి.స.)

సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇక్కడి నుంచి సింగపూర్(Singapore)కు ఒక బృందాన్ని పంపించారని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ప్రశ్నించారు. 142 హామీలు ఇచ్చారని, ఎన్ని అమలు చేశారని ఆయన ప్రశ్నించారు. ఏమీ అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దుర్మార్గమని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైందని, పింఛన్లు ఎగ్గొట్టారని, పథకాలు అమలు చేయకుండా మోసం చేసే కార్యక్రమాలు చేసే దుష్ట పరిపాలన ఇది అని మండిపడ్డారు. కూటమి మేనిఫెస్టో ఎక్కడ ఉందని, తమ మేనిఫెస్టోను ప్రతి కలెక్టరేట్లో గోడకు తగిలించామని, అన్ని అమలు చేశామని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande