దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..16 మంది భక్తులకు గాయాలు
దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..16 మంది భక్తులకు గాయాలు
acc


మదనపల్లె, 10 మే (హి.స.)

అన్నమయ్య జిల్లా మదనపల్లె బైపాస్లోని రాయల్ ఉడ్ వద్ద బోయకొండ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొంది. ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన 16 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 60 మంది భక్తులు ఐచర్తో పాటు బొలెరోలో బోయకొండకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande