
అమరావతి, 11 మే (హి.స.)
అమరావతి, మే 11 (ఆంధ్రజ్యోతి):జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడుశుభాకాంక్షలు తెలిపారు. పోఖ్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.
భవిష్యత్తు టెక్నాలజీల కోసం ఆంధ్రప్రదేశ్లో బలమైన ఎకోసిస్టమ్ నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో డీప్టెక్ స్కిల్లింగ్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో IBM SkillsBuild, APSCHE, APSSDC, Quantum Valley భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ