ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న ఏపీసీఎం
ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న ఏపీసీఎం
ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న ఏపీసీఎం


అమరావతి, 11 మే (హి.స.)

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీ, అస్సాం వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోం మంత్రి అమిత్షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలె్సలో జరిగే సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) వార్షిక సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్.మహేంద్రదేవ్తోపాటు నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బసచేసి.. మంగళవారం గువాహటి వెళ్తారు. అక్కడ అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమరావతి బయల్దేరి వస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande