మహబూబ్నగర్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
మహబూబ్నగర్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
మహబూబ్నగర్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి


మహబూబ్నగర్, 11 మే (హి.స.)మహబూబ్నగర్

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్లో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (అర్షియా బేగం, ఇద్దరు చిన్నారులు - హుజైఫా, ఉమర్) మరియు బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు ఉన్నారు.అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:30 - 1 గంటల మధ్య) కారు యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో, హైదరాబాద్ నుంచి వస్తున్న స్పోర్ట్స్ బైక్ సుమారు 140 కి.మీ వేగంతో వచ్చి కారును ఢీకొట్టింది.యువకులు బైక్ రేసింగ్కు పాల్పడటం మరియు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande