
తిరుపతి(టీటీడీ) 11 మే (హి.స.)
టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాల మార్పుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అభ్యర్థి మూడు రెండు, మూడు విభాగాల్లో దరఖాస్తు చేసుకుంటే వారికి ఒకేచోటు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముందుగా చెప్పిన అధికారులు.. చివరి నిమిషంలో వాటిని మార్చేశారు. ఏఈఈ(సివిల్ నిర్వహిస్తున్న పార్క్ కేంద్రాల మరియు), ఏఈఈ(ఎలక్ర్టికల్), ఏఈ (సివిల్), ఏటీవో(సివిల్) మొత్తం 45 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 39వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆది, సోమవారాల్లో 93 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టారు. తొలుత 6వ తేదీన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక్కో అభ్యర్థి మూడు పరీక్షలు రాసినా ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష ఉంటుందని ప్రకటించారు. అయితే ఆదివారం అభ్యర్థులు పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్లు రేపటి పరీక్ష కేంద్రం మార్చారని, హాల్ టికెట్లు మరోమారు చూసుకోవాలని సూచించారు. దీంతో అభ్యర్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కడప జిల్లాలోని ఒక పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన వ్యక్తికి సోమవారం కుప్పంలో మరో పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. పరీక్ష ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుంది. అధికారులు జారీ చేసిన ప్రకటనలో పరీక్షకు రెండు గంటల ముందుగానే అభ్యర్థులు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. అంటే పరీక్ష రాసిన అనంతరం మళ్లీ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకుని, అందులో తమకు వచ్చిన కేంద్రాన్ని చూసుకుని అంతదూరం సకాలానికి చేరుకోవాల్సి ఉంది. ఇది ఎంతో వ్యయప్రయాసలతో కూడినదని అభ్యర్థులు వాపోతున్నారు. ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ