కృష్ణ జిల్లా.ఎస్పీ ఐజీ.కి హోంమంత్రి అనిత అభినందలు
కృష్ణ జిల్లా.ఎస్పీ ఐజీ.కి హోంమంత్రి అనిత అభినందలు
కృష్ణ జిల్లా.ఎస్పీ ఐజీ.కి హోంమంత్రి అనిత అభినందలు


కృష్ణా జిల్లా, 11 మే (హి.స.)

గత ఐదేళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడిరోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ.. ఎస్పీ, ఐజీని హోం మంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని అనిత అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande