
హైదరాబాద్, 11 మే (హి.స.)తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడి కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. బాధితురాలు బాలిక కావడం, ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిౌ పోలీసులు బాలిక స్టేట్మెంట్ను చట్టపరమైన నిబంధనల ప్రకారం రికార్డ్ చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు కూడా పరిశీలించే అవకాశముంది.
ఈ ఘటనపై హైదరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలికకు సంబంధించిన కేసు కావడంతో చట్టపరమైన ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా అమలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్