జనగణనలో తప్పులు జరగకుండా అప్రమత్తంగా పనిచేయాలి: యాదాద్రి జిల్లా కలెక్టర్
జనగణనలో తప్పులు జరగకుండా అప్రమత్తంగా పనిచేయాలి: యాదాద్రి జిల్లా కలెక్టర్
Collector


యాదాద్రి భువనగిరి, 11 మే (హి.స.)

జనగణన -2027 తొలి దశ గృహగణన కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ప్రత్యక్షంగా సూచించారు. పరిశీలించారు. మోటకొండూరు మండలంలోని దిలావర్పూర్ గ్రామంతో పాటు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 30, 31వ వార్డుల్లో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహగణన ప్రక్రియలో ఎలాంటి ఇళ్ల మినహాయింపు, డూప్లికేషన్ లేదా ఓవర్ల్యాపింగ్ జరగకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు హెచ్ఎల్బీ (హౌస్ లిస్టింగ్ బ్లాక్) సరిహద్దుల నిర్ధారణ, ఇంటింటి సమాచారం సేకరణ, మ్యాపుల ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి ఇంటిని పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సరైన వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. గృహగణన పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తయితే భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడే సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా జనగణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande