కర్నూలు రైతు బజార్కు కొత్త కళ.. రూ. 6 కోట్లతో విస్తరణ పనుల ప్రారంభం
కర్నూలు రైతు బజార్కు కొత్త కళ.. రూ. 6 కోట్లతో విస్తరణ పనుల ప్రారంభం
summer-sports-coaching-camp-tg-bharath-world-class-stadium-such


కర్నూలు, 11 మే (హి.స.) కర్నూలు నగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నగరంలోని సి.క్యాంపు రైతు బజార్ విస్తరణ పనులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భూమిపూజ చేశారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విస్తరణ పనులను చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ..‘రైతులకు, వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సి.క్యాంపు రైతు బజార్లో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక సౌకర్యాలతో దీనిని విస్తరిస్తున్నాం. ఈ పనులను వచ్చే తొమ్మిది నెలల కాలపరిమితిలోగా పూర్తి చేస్తాం. ఇందుకోసం అధికారులకు దిశానిర్దేశం చేశాం. రైతు బజార్ విస్తరణ పూర్తయిన వెంటనే, సామాన్యుల సౌకర్యార్థం అక్కడ అన్నా క్యాంటిన్ను కూడా ఏర్పాటు చేస్తాం. బి.క్యాంపు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటూ నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు నినాదాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజలకు మాట ఇచ్చాం.. నిలుపుకొంటున్నాం.’ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande