సింగపూర్ లో విద్యా ఐటీ.శాఖ మంత్రి నారా లోకేష్. పర్యటన
సింగపూర్ లో విద్యా ఐటీ.శాఖ మంత్రి నారా లోకేష్. పర్యటన
సింగపూర్ లో విద్యా ఐటీ.శాఖ మంత్రి నారా లోకేష్. పర్యటన


అమరావతి, 11 మే (హి.స.)

సింగపూర్/అమరావతి, సింగపూర్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను నిర్మించనున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే మోడల్ టౌన్షిప్గా నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్(మీటింగ్స్, ఇన్సెన్టీవ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సులభతర వాణిజ్యం కోసం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్లో సింగపూర్ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకోనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande