
నిర్మల్, 11 మే (హి.స.)
నిర్మల్ డీఎస్పీ టి. శ్రీనివాస్
ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలం వడ్యాల్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండాలని, యువత చెడు ఆలోచనలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి, వాటి ద్వారా నేరాలను అరికట్టడంలో ఎలా ఉపయోగపడుతాయో ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో చలానాలు చెల్లించని 52 వాహనాలను గుర్తించి, వాటికి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణచాంద ఎస్సై ఎస్. శ్రావణి, గోపి, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు