
అమరావతి, 11 మే (హి.స.)
తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు సోహిత, ధన్యత జనగణనపై చైతన్యం కల్పించేలా ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ‘సమగ్ర జనగణన వివరాల సేకరణ దేశాభివృద్ధికి సోపానాలు.. సరైన సమాచారం అందించడం మన బాధ్యత’. అని దానిపై రాశారు. ఆదివారం రంగంపేటలో 16 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల పొడవుతో దీనిని రూపొందించారు.ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనడం ఎంత ముఖ్యమో చూపే విధంగా, కుటుంబ సభ్యులందరూ (తల్లి, తండ్రి, పిల్లలు) కలిసి ఉన్నట్లుగా ఇసుక శిల్పం రూపొందించారు. ఇది ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ విధంగా సైకత శిల్పాలను రూపొందించడం వల్ల, ప్రజలు జనగణన యొక్క ఆవశ్యకతను సులభంగా అర్థం చేసుకుంటారు . చైతన్యాన్ని పొందుతారని ఆ అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ