
నిజామాబాద్, 11 మే (హి.స.)
తెలంగాణలో రాబోయేది బీజేపీ
ప్రభుత్వమేని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చి చేయబోయే అభివృద్ధి పనులపై ఏం చేస్తారో చెప్పకుండా ప్రధాని కేవలం రాజకీయాలే మాట్లాడటం సరికాదని అన్నారు. విభజన హామీల గురించి మాట్లాడాల్సిందని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై మోడీకి అవగాహన ఉన్నట్లు లేదని కామెంట్ చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదిగే అవకాశం ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు. బెంగాల్ (Bengal) తరహాలో తెలంగాణలో ఓట్లు తొలగిస్తామంటే కుదరదని అన్నారు. అసలు బీజేపీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగుల హామీ ఏమైందో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇక ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..