బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను  పరిశీలించిన  ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు


అనంతపురం, 11 మే (హి.స.)గుమ్మఘట్ట నియోజకవర్గంలో ఈ ఏడాది రబీసీజనలో 1.15 లక్షల ఎకరాల దాకా సాగునీటితో రైతులు వరిపంట సాగుచేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

అధిక ది గుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మండలంలోని కలుగోడు గ్రామంలో బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన రైతు లతో మాట్లాడి పంటల దిగుబడిపై ఆరా తీశారు. రైతు కరిబసప్ప 50 బస్తాల నుంచి 60 బస్తాల దాకా ఎకరాకు దిగుబడి వస్తుందన్నారు. అంతేగాకుండా పంటలకు పురుగుమందులు పిచికారి చేసే అవసరం రాలేదని సంతోషం వ్యక్తం చేశారు.

పురుగులమందులు పిచికారి చేయక పోవడం వల్ల తమ పంటలకు మంచి డిమాండ్ ఉందని రైతులు వెల ్లడించారు. ప్రభుత్వ గిట్టుబాటు ధర కన్నా ఎక్కువకు కొనుగోలు చేసేం దుకు మిల్లర్లు సైతం ఇష్టపడుతున్నారని వెల్లడించారు. ఏది ఏమైనా ఈ ప్రాంతం రైతులు సకాలంలో మంచి పంటలు పండించుకుని సుభిక్షంగా ఉంటున్నారని, ఇది తమ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు ఆకాంక్ష అని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande