రాష్ట్ర ప్రజలకు అలర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
కర్నూలు, 11 మే (హి.స.) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఏలూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడ
rain


కర్నూలు, 11 మే (హి.స.)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఏలూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది APSDMA. 40-50కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande