
చిత్తూరు, 11 మే (హి.స.)
ఆన్లైన్ బెట్టింగులకు బానిసైన జీడి నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్ పురం మండలానికి చెందిన సి మహేష్ బాబు (22) ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ రోజు సోమవారం ఉదయం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ సచివాలయాలను నిందితుడు టార్గెట్ చేస్తూ రూ 6, 50, 544 విలువైన 30 ప్రింటర్లు, రూ 1, 59, 866 విలువైన మూడు లాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నామని, ఇతనిపై 18 కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఎస్పీ తెలిపారు.
నేరాలకు పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని, చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV