
హైదరాబాద్, 11 మే (హి.స.)కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెతిస్తున్నసంగతి తెలిసిందే. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటుచేసిందిఈ క్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహిత, సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘తల్లిదండ్రులందరినీ అభ్యర్థిస్తున్నా.. ఒక వేళ మీ కొడుకు లైంగిక దాడులు చేస్తే అతన్ని కాపాడే ప్రయత్నం చేయకండి. ఇలాంటి తప్పులు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని వారికి (మీ కొడుకు)తెలిసేలా చేయడం వల్ల సమాజానికి మీరు గొప్ప సేవ చేసినవారవుతారని’ సునీతాకృష్ణన్ ట్వీట్ చేశారు. సునీతాకృష్ణన్ బండి సంజయ్ కుమారుడి కేసును గుర్తు చేస్తూ పరోక్షంగా చేసిన ఈ ట్వీట్ అందరినీ ఆలోచింప జేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi