
విశాఖ, 12 మే (హి.స.)
పీఎం శ్రీ పథకంలో భాగంగా ఎంపికైన విశాఖలోని ఉన్నత పాఠశాలలకు సీసీ కెమెరాలను విద్యాశాఖ అధికారులు మంజూరు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పెందుర్తి, చిట్టివలస, రెడ్డిపల్లి, ఆనందపురం పాఠశాలల్లో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆనందపురం ఉన్నత పాఠశాలలో 20 చోట్ల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఉపాధ్యాయులు వెల్లడించారు. సుమారు నాలుగున్నర ఎకరాల్లో విస్తరించిన పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రధానంగా వేసవి కాలంలో విద్యాలయంలోకి మందుబాబులు రాకుండా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కె.కామేశ్వరరావు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ