
అమరావతి, 12 మే (హి.స.)
విజయవాడ, : విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రత్యూష అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ అవుట్డోర్ యూనిట్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అనంతరం ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించడంతో భారీ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏసీ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యూష అపార్ట్మెంట్ బాల్కానీలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండీషనర్ అవుట్డోర్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్ను అంటుకున్నాయి. మంటలు గ్యాస్ సిలిండర్ను తాకడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాల్కనీ గోడ పూర్తిగా ధ్వంసమైంది. గోడ రాళ్లు ఎగిరిపడి పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసులకు తగిలాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ