లంచం తీసుకొన్న కేసులో పురపాలక శాఖ. డీ ఈ ఏసీబీ వలలో
సామర్లకోట, 12 మే (హి.స.) : లంచం తీసుకున్న కేసులో పురపాలక శాఖ డీఈ ఏసీబీ వలలో చిక్కారు. సామర్లకోట పురపాలికలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్.. తనకు బిల్లులు చెల్లించాలని పురపాలక శాఖ డీఈ శశిధర్ను కోరారు. బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాల్సిందిగ
లంచం తీసుకొన్న కేసులో పురపాలక శాఖ. డీ ఈ ఏసీబీ వలలో


సామర్లకోట, 12 మే (హి.స.)

: లంచం తీసుకున్న కేసులో పురపాలక శాఖ డీఈ ఏసీబీ వలలో చిక్కారు. సామర్లకోట పురపాలికలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్.. తనకు బిల్లులు చెల్లించాలని పురపాలక శాఖ డీఈ శశిధర్ను కోరారు. బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాల్సిందిగా గుత్తేదారుడిని డీఈ డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా.. డీఈ శశిధర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండడ్గా పట్టుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande