ఎమ్మెల్సీల భవనాలు దాదాపు.పూర్తి మంత్రినారాయణ తెలిపారు
అమరావతి, 12 మే (హి.స.) ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపుగా పూర్తయ్యాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అధికారులు, మంత్రుల నివాస భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు. మంగళవారం రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయ
ఎమ్మెల్సీల భవనాలు దాదాపు.పూర్తి మంత్రినారాయణ తెలిపారు


అమరావతి, 12 మే (హి.స.)

ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపుగా పూర్తయ్యాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అధికారులు, మంత్రుల నివాస భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు. మంగళవారం రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.

అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వారం రోజుల్లో ఎమ్మెల్యే, 20 రోజుల్లో ఎమ్మెల్సీ భవనాలు సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖకి అప్పగిస్తామని వివరించారు. ఈ భవనాలకు సంబంధించిన మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 టవర్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయన్నారు. రైతుల్లో 98.6 శాతం మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని పేర్కొన్నారు.

పలు వివాదాల కారణంగా కొన్ని ప్లాట్లు పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2027 ఆగస్ట్ నాటికి ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. అమరావతి రాజధాని అభివృద్ధి పనుల్లో కీలక పురోగతి సాధించినట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగవంతం చేసినట్లు మంత్రి నారాయణ వివరించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande