హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్.. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్
హైదరాబాద్, 12 మే (హి.స.) మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయ
Bandi


హైదరాబాద్, 12 మే (హి.స.)

మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో వెకేషన్ బెంచ్లో బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మే 14వ తేదీన హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.

కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్్ప నమోదైన పోక్సో కేసు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బండి భగీరథ్ అరాచకాలపై, పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande