ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్.. ఎరువుల నిల్వపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ, 12 మే (హి.స.) దేశంలో ఖరీఫ్ (Kharif) సాగు కాలం సమీపిస్తున్న తరుణంలో ఎరువుల లభ్యతపై రైతుల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) తెరదించింది. ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు దేశంలో అందుబాటులో ఉన్నాయని కేంద్ర
Central


న్యూఢిల్లీ, 12 మే (హి.స.)

దేశంలో ఖరీఫ్ (Kharif) సాగు కాలం

సమీపిస్తున్న తరుణంలో ఎరువుల లభ్యతపై రైతుల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) తెరదించింది. ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు దేశంలో అందుబాటులో ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ స్పష్టం చేసింది. సీజన్ ప్రారంభంలో ఎరువుల కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో రైతులు ఒక్కసారిగా కొనుగోళ్లకు ఎగబడాల్సిన (Panic Buying) అవసరం లేదని కేంద్రం సూచించింది. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది. ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకు డిమాండ్కు అనుగుణంగా ఎరువులను సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా వెల్లడించింది.

యూరియా (Urea) తో పాటు ఇతర పోషక ఆధారిత ఎరువులను(Nutrient-based fertilizers) నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని, బఫర్ స్టాక్ తగినంతగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కడా సరఫరా గొలుసు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, రైతులకు అందించే ప్రధాన ఎరువుల ధరలు స్థిరంగా ఉండేలా చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ డీలర్ల వద్ద ఎరువుల ధరలను పర్యవేక్షిస్తున్నామని, నిర్ణీత ధరలకే రైతులకు ఎరువులు అందేలా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని కేంద్రం వివరించింది. ఈ ప్రకటనతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande