పోటెత్తిన హనుమాన్ భక్తులు.. రామ నామస్మరణతో మార్మోగిన భద్రాద్రి
భద్రాచలం, 12 మే (హి.స.) హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య దర్శనం కొరకు హనుమాన్ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, ఇరుముడి శిరస్సున ధరించి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయ ప్రాంగణంలోని
Badradri


భద్రాచలం, 12 మే (హి.స.)

హనుమాన్ జయంతి సందర్భంగా

భద్రాద్రి రామయ్య దర్శనం కొరకు హనుమాన్ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, ఇరుముడి శిరస్సున ధరించి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారికి ఇరుముడి సమర్పించి, దీక్ష విరమణ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మందికి పైగా హనుమాన్ దీక్ష స్వాములు భద్రాద్రికి తరలి రావడంతో క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. రామనామ స్మరణతో భద్రాద్రి మార్మోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు శీఘ్ర దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande