పశువుల అక్రమ రవాణా పై జోగులాంబ ఎస్పి ప్రత్యేక నజర్..
జోగులాంబ గద్వాల, 12 మే (హి.స.) రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా జరగకుండా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఉండవెల్లి మండలంలోని పుల్లూరు ట
Sp


జోగులాంబ గద్వాల, 12 మే (హి.స.)

రానున్న బక్రీద్ పండుగను

పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా జరగకుండా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను జిల్లా ఎస్పీ అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భైరాపురం, పుల్లూరు టోల్ ప్లాజా, ఎర్రవల్లి X రోడ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, ముఖ్యంగా కంటైనర్ లారీలు, లోడ్ వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, పశువుల రవాణాకు అవసరమైన అనుమతులు, డ్రైవర్ల వివరాలు పూర్తిగా పరిశీలించాలని సూచించారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. రవాణా సమయంలో పశువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించినా, నిబంధనలకు విరుద్దంగా తరలించినా సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, కొనుగోలు రసీదులు, వెటర్నరీ ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్పీ గారు సూచించారు. వాహనాలలో సామర్థ్యానికి మించి పశువులను ఎక్కించరాదని, పశువులకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande