టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్దులకు మంత్రి సవిత సత్కరించారు
విజయవాడ, 12 మే (హి.స.) , టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థులను మంత్రి సవిత సత్కరించారు. దాదాపు 400 మంది విద్యార్థులకు పురస్కారాలు, మెమోంటోలను అందజేశారు. టెన్త్ క్లాస్లో ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థిని, నంద్యాలకు చెందిన సా
టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్దులకు మంత్రి సవిత సత్కరించారు


విజయవాడ, 12 మే (హి.స.)

, టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించిన గురుకుల విద్యార్థులను మంత్రి సవిత సత్కరించారు. దాదాపు 400 మంది విద్యార్థులకు పురస్కారాలు, మెమోంటోలను అందజేశారు. టెన్త్ క్లాస్లో ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థిని, నంద్యాలకు చెందిన సాయి శ్రీ 596 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అంతా బీసీ సంక్షేమ స్కూల్స్వైపే చూడ్డానికి కారణం ప్రిన్సిపాల్స్, సెక్రటరీస్, డైరెక్టర్లు అని అన్నారు. బీసీ సంక్షేమ స్కూళ్లలో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు నిరూపించారన్నారు. వేదిక మీద చాలామంది గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నవారే ఉన్నారన్నారు. ‘తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి.. మీ బిడ్డలను బీసీ సంక్షేమ స్కూల్స్కు పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని మంత్రి అన్నారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగానే విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని తెలిపారు.

రోజుకి 20 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్పై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అధికారంలోకి రాగానే డైట్ బిల్లు రూ.110 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మస్కిటో మెష్, ఇన్వైటర్స్, ఆర్వో ప్లాంట్స్, సన్న బియ్యం, 100 డేస్ యాక్షన్ ప్లాన్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ అందిస్తున్నామన్నారు.

విద్యతో పాటు స్పోర్ట్స్ డెవలప్ చేసే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. 1500 టాయిలెట్స్ బీసీ స్కూళ్లలో రెడీ అవుతున్నాయని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం మంచి రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎంజేపీ గురుకులాల్లో ప్రస్తుతం స్కూల్స్ మాత్రమే ఉన్నాయని.. 6 కాలేజీల ఏర్పాటుకు అనుమతి వచ్చిందని మంత్రి అన్నారు. బీసీ సంక్షేమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయన్నారు. బీసీ సంక్షేమ స్కూళ్లలో ఒక హాస్టల్ విద్యార్థికి 75 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande