
ములుగు, 12 మే (హి.స.)
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు అత్యంత కీలకమైనవని, ఈవీఎంల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అలసత్వం వహించవద్దని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం ఈవీయం గోదాంను కలెక్టర్, పలు పార్టీ నాయకుల సమక్షంలో నెల వారి తనిఖీ నిర్వహించారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరును, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టెంగిషర్లను, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత విషయంలో అత్యంత పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ ఎండీ సలీం, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు