
హైదరాబాద్, 12 మే (హి.స.)జూబ్లీహిల్స్లో హత్యకు గురైన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నేపాలీలను పనిలో పెట్టుకున్న యజమానుల వివరాలను పోలీసులు. సేకరిస్తున్నారు. పనిమనుషులు ఉంటే వారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేయాలని యజమానులకు సూచించారు. నేపాలీలను పనిలో పెట్టుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్