ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. హైవేపై ఎదురెదురుగా ఢీకొన్న లారీలు.. ఇద్దరు సజీవ దహనం
ఖమ్మం, 12 మే (హి.స.) ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు(మంగళవారం) ఉదయం వైజాగ్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న బొగ్గు లారీ, మరియు మర్రిపేడ నుంచి ఖమ్మం వైపు వెళుతున్న ఆలుగడ్డ లోడ్ లారీ, మండలంలోని మేకల తండా స్టేజి
Accident


ఖమ్మం, 12 మే (హి.స.)

ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు(మంగళవారం) ఉదయం వైజాగ్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న బొగ్గు లారీ, మరియు మర్రిపేడ నుంచి ఖమ్మం వైపు వెళుతున్న ఆలుగడ్డ లోడ్ లారీ, మండలంలోని మేకల తండా స్టేజి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు కాగా, ప్రమాద దాటికి బొగ్గులోడ్ లో మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు వ్యాపించి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.

నందిగామ సమీప గ్రామమైన బొగ్గు లారీ డ్రైవర్ జేమ్స్ తో పాటు, మరో వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్ ప్రమాద స్థలానికి చేరుకొని, ఫైర్ ఇంజన్ రప్పించి అగ్నిమాపక సిబ్బంది ద్వారా మంటలను అదుపు చేస్తున్నారు. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో హైవేపై 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande