తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Maoist surrender


హైదరాబాద్, 12 మే (హి.స.)మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఝార్ఖండ్లోని సరండా ఫారెస్ట్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం కూంబింగ్ కొనసాగుతున్న క్రమంలో.. నరహరి తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి కాగా.. అతని భార్య ఏపీకి చెందిన మహిళగా సమాచారం. 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్న నరహరి పలు కీలక ఆపరేషన్స్లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిసిర్ బెస్ర కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande