
జహీరాబాద్, 12 మే (హి.స.)
తెలంగాణ కర్ణాటక సరిహద్దులో
-బీదర్ - జహీరాబాద్ రోడ్డుపై శంషల్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక బీదర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. జహీరాబాద్ - బీదర్ రోడ్డు, తెలంగాణ కర్ణాటక సరిహద్దు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీదర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు న్యాల్ కల్ మండలానికి చెందిన వారిని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..