తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కారు
తిరుమల , 12 మే (హి.స.) తిరుమల తిరుపతిలోని అలిపిరి వద్ద సోమవారం అర్ధరాత్రి ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. అలిపిరి ఓల్డ్ చెక్ పోస్ట్ (Alipiri Old Check Post) పాయింట్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో భోజనం చేస్తున్న భక్తులపైకి ఒక ప్రైవేటు వాహనం అదుపుతప్పి
acc


తిరుమల , 12 మే (హి.స.)

తిరుమల తిరుపతిలోని అలిపిరి వద్ద సోమవారం అర్ధరాత్రి ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. అలిపిరి ఓల్డ్ చెక్ పోస్ట్ (Alipiri Old Check Post) పాయింట్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో భోజనం చేస్తున్న భక్తులపైకి ఒక ప్రైవేటు వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు అలిపిరి పార్కింగ్ స్థలంలో రోడ్డు పక్కన భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక వాహనం ఒక్కసారిగా వేగంగా కదులుతూ భక్తుల వైపు దూసుకొచ్చింది.

ఈ అనుకోని ప్రమాదంతో అక్కడ ఉన్నవారు భయాందోళన తో పరుగులు తీశారు. అయినప్పటికీ ఐదుగురు భక్తులు వాహనం కింద పడి గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో గేర్ న్యూట్రల్లో ఉండటం, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం వెనక్కి దూసుకువచ్చి భక్తులను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన భక్తులను తక్షణమే చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande