అనంతపురంలో వైభవంగా హనుమాన్ జయంతి.. ఆధ్యాత్మిక శోభలో నగరం!
అనంతపురం, 12 మే (హి.స.) హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. నగరం మొత్తం శ్రీ ఆంజనేయం.. జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది. ఆలయాల సందడి నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఇందిరా నగర్, కోర్టు రోడ్డు, మరియు హౌసిం
/hanuman-jayanti-2026-grand-celebrations-in-anantapur-cit


అనంతపురం, 12 మే (హి.స.)

హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. నగరం మొత్తం శ్రీ ఆంజనేయం.. జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది.

ఆలయాల సందడి నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఇందిరా నగర్, కోర్టు రోడ్డు, మరియు హౌసింగ్ బోర్డు లోని అభయాంజనేయ స్వామి ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఉదయం నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు మరియు వివిధ రకాల పుష్పాలతో అలంకారాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.గాలిపుత్రుడైన ఆ హనుమంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుందాం. జై భజరంగబలి!

హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని కోర్ట్ రోడ్ లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు పాల్గొన్నారు. ఆయన ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande