
నంద్యాల , 12 మే (హి.స.)నంద్యాల జిల్లాలో ఈ రోజు మే 12న జరగనున్న హనుమాన్ శోభాయాత్రకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరులో భారీ శోభాయాత్రలు జరగనున్నాయి. మార్గాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. రూఫ్ టాప్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం షాపులు మూసివేశారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. టెక్కే నుంచి పాతబస్టాండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV